News January 31, 2025
కుంభమేళాకు కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాగరాజ్ కుంభమేళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా 4 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15న మౌలాలి- గయా (07089) ఎక్స్‌ప్రెస్ 19.43 గంటలకు, 18న వికారాబాద్- గయా (07091) ఎక్స్ ప్రెస్ 19.43 గంటలకు, 18న మౌలాలి- బనారస్ (07087) ఎక్స్‌ప్రెస్ 02.08 గంటలకు, 22న మౌలాలి- అజాంఘర్ (07707) 02.08 గంటలకు కాజీపేటకు చేరుకుంటాయని తెలిపారు.
Similar News
News February 9, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ప్రజావాణి కార్యక్రమం వాయిదా
> జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటిన స్టేషన్ ఘనపూర్ విద్యార్థులు
> షెడ్యూల్ కులాల రిజర్వేషన్ పెంచాలి: కడియం
> తప్పుడుగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని NSUI నేతల డిమాండ్
> ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
> సోమేశ్వరాలయానికి అరకిలో వెండి పూర్ణకుంభం అందజేత
News February 9, 2025
భూపాలపల్లి జిల్లా పరిధి నేటి ముఖ్యాంశాలు

✓ కాళేశ్వరం మహాకుంబాభిషేకం ఉత్సవాలకు హాజరైన మంత్రులు కొండ సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ✓ మహాదేవపూర్ చెరువులో పడి వ్యక్తి మృతి✓ రేగొండలో అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు✓ ధన్వాడ దత్తాత్రేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు✓ గణపురం కోటగుళ్లలో సందడి చేసిన పాఠశాల విద్యార్థులు✓ చిట్యాల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
News February 9, 2025
సికింద్రాబాద్: షాపింగ్ మాల్‌లో సూసైడ్ అటెంప్ట్!

సికింద్రాబాద్‌లో ఆదివారం దారుణం జరిగింది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఓ షాపింగ్ మాల్‌లో భార్య మౌనిక పని చేస్తుండగా ఆమెతో గొడవ పడి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో కస్టమర్లు ఉండగానే ఘటన జరగడంతో అందరూ పరుగులు తీశారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.