News January 31, 2025

కుంభమేళాకు కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాగరాజ్ కుంభమేళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా 4 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15న మౌలాలి- గయా (07089) ఎక్స్‌ప్రెస్ 19.43 గంటలకు, 18న వికారాబాద్- గయా (07091) ఎక్స్ ప్రెస్ 19.43 గంటలకు, 18న మౌలాలి- బనారస్ (07087) ఎక్స్‌ప్రెస్ 02.08 గంటలకు, 22న మౌలాలి- అజాంఘర్ (07707) 02.08 గంటలకు కాజీపేటకు చేరుకుంటాయని తెలిపారు.

Similar News

News July 6, 2025

ఈనెల 10న మెగా పేరెంట్ మీట్: కలెక్టర్

image

జిల్లాలని అన్ని పాఠశాలల్లో ఈనెల 10న మెగా పేరెంట్ మీట్ నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉన్న 1385 పాఠశాలల్లో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో హాజరవ్వాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పథకంలో అతిథిలకు స్కూల్లోనే భోజనం అందించాలన్నారు 212 జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలన్నారు.

News July 6, 2025

ఆ సమయంలో 9 రోజులు అన్నం ముట్టను: హీరోయిన్

image

తాను ఏడాదికి రెండు సార్లు ఉపవాసం ఉంటానని హీరోయిన్ నర్గీస్ ఫక్రీ తెలిపారు. ఆ సమయంలో 9 రోజులపాటు ఏమీ తిననని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఉపవాసం చేసినన్ని రోజులు నీళ్లు తాగే బతుకుతా. ఫాస్టింగ్ అయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కానీ ముఖంలో కాస్త గ్లో ఉంటుంది. ఉపవాసం అయిపోయాక హై ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటా’ అని చెప్పుకొచ్చారు. కాగా నర్గీస్ ఇటీవల విడుదలైన ‘హౌస్‌ఫుల్ 5‘ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.

News July 6, 2025

ధర్మపురి : ‘పనుల నాణ్యతపై రాజీ ఉండకూడదు’

image

పనుల నాణ్యతపై రాజీ ఉండకూడదని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం ధర్మపురిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న గదులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. వైద్య సేవలు, శుభ్రతపై సమీక్షించి, అత్యవసర పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. కేంద్రం పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.