News January 31, 2025
కుంభమేళాకు కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాగరాజ్ కుంభమేళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా 4 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15న మౌలాలి- గయా (07089) ఎక్స్‌ప్రెస్ 19.43 గంటలకు, 18న వికారాబాద్- గయా (07091) ఎక్స్ ప్రెస్ 19.43 గంటలకు, 18న మౌలాలి- బనారస్ (07087) ఎక్స్‌ప్రెస్ 02.08 గంటలకు, 22న మౌలాలి- అజాంఘర్ (07707) 02.08 గంటలకు కాజీపేటకు చేరుకుంటాయని తెలిపారు.
Similar News
News October 21, 2025
ప్రకృతి గీసిన ‘నిడిగొండ’ చిత్రం

నీలి మేఘాల కింద కారుమబ్బులు అలుముకొని, అస్తమిస్తున్న సూర్యుడికి వాహనాల వెలుగులు దారి చూపుతున్నట్లు ఎంతో అద్భుతంగా ప్రకృతి గీసిన ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. రఘునాథ్ పల్లి మండలం నిడిగొండలో సోమవారం సాయంత్రం ఈ చిత్రం ఆవిష్కృతమైంది. స్థానికుడైన వెంకటేష్ తన ఫోన్లో బంధించి Way2Newsతో ఈ చిత్రాన్ని పంచుకున్నాడు.
News October 21, 2025
జనగామ: బెస్ట్ అవైలబుల్ చదువులకు తొలగిన అడ్డంకులు

బెస్ట్ అవైలబుల్ పథకం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాలు చేపట్టారు. స్పందించిన ప్రభుత్వం విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయా సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అధికారులు జిల్లాలోని 5 బెస్ట్ అవైలబుల్ స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడి బోధనకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
News October 21, 2025
ఏపీ, టీజీ న్యూస్ రౌండప్

* మిగతా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి: TG సీఎం రేవంత్
* నవంబర్ 7న ఏపీ క్యాబినెట్ భేటీ
* ఖైరతాబాద్, శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాలను సందర్శించిన కేటీఆర్, హరీశ్ రావు
* నారా నరకాసుర పాలన పోవాలి.. జగనన్న పాలన రావాలి: రోజా
* హైదరాబాద్‌లో బాణసంచా కాలుస్తూ 70 మందికి గాయాలు