News January 29, 2025

కుంభమేళాకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైలు

image

కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా గయకు(బీహార్) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07095 కాకినాడ టౌన్- గయ రైలును ఫిబ్రవరి 8న, నం.07096 గయ- విజయవాడ ఫిబ్రవరి 10న నడుపుతున్నామంది. నం.07095 రైలు 8న సాయంత్రం 7.35కి విజయవాడ చేరుకుని 10న ఉదయం 10 గంటలకు గయ చేరుకుంటుందని, 10న నం.07096 రైలు మధ్యాహ్నం 2.15కి బయలుదేరి 12న సాయంత్రం 4కి విజయవాడ చేరుకుంటుందని తెలిపింది.

Similar News

News November 21, 2025

ప్రకాశం: స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి

image

స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి ధర్తీమాతా బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ధర్తీ మాత బచావో అభియాన్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తమ పొలాల నేల పరిస్థితులను మెరుగుపరచడానికి అవసరమైన ఎరువులను వినియోగించేలా అధికారులు సూచించాలన్నారు.

News November 21, 2025

IPSల బదిలీ.. సిటీకి కొత్త బాస్‌లు

image

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. CID డీఐజీగా పరిమళ నూతన్, మహేశ్వరం DCPగా నారాయణరెడ్డి, నార్కోటిక్ SPగా పద్మజా, మల్కాజిగిరి DCPగా శ్రీధర్, సౌత్ జోన్ DCPగా కిరణ్ ఖారే, టాస్క్‌ఫోర్స్ DCPగా వైభవ్ గైక్వాడ్, ఎస్ఎంఐటీ డీసీపీగా రూపేశ్, గవర్నర్ ఏడీసీగా పి.సుభాష్, టీజీ ట్రాన్స్‌కో ఎస్పీగా శ్రీనివాస్, రాచకొండ క్రైమ్స్ డీసీపీగా గుణశేఖర్‌ను నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.

News November 21, 2025

BREAKING: ఆసిఫాబాద్ SPగా నితిఖా పంత్

image

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొమురం భీమ్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నితిఖా పంత్ నూతన ఎస్పీగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.