News February 17, 2025
కుంభమేళాలో అనకాపల్లి ఎంపీ

అనకాపల్లి ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సీఎం రమేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్రాజ్ వెళ్లారు. మహా కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. మహావిష్ణు, పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
MBNR: గ్రీవెన్స్ డేలో 19 ఫిర్యాదులు: ఎస్పీ

మహబూబ్నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి మొత్తం 19 మంది అర్జీదారుల వినతులను స్వీకరించి, పరిశీలించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపైనా వెంటనే స్పందించిన ఎస్పీ, సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News November 24, 2025
శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్కు 52అర్జీలు

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 52 ఫిర్యాదులు వచ్చాయి. వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
News November 24, 2025
నేరుగా రైతుల నుంచే కొనండి.. హోటళ్లకు కేంద్రం సూచన

వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా రైతుల ఉత్పత్తి సంస్థల (FPO) నుంచే కొనాలని హోటళ్లు, రెస్టారెంట్లను కేంద్ర ప్రభుత్వం కోరింది. సప్లై చైన్ నుంచి మధ్యవర్తులను నిర్మూలించడం ద్వారా రైతుల రాబడిని పెంచవచ్చని చెప్పింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్(GI) ట్యాగ్ ఉన్న ఆహార ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సూచించింది. దేశంలో 35వేల FPOలు ఉన్నాయని, వాటిలో 10వేల వరకు ప్రభుత్వం స్థాపించిందని తెలిపింది.


