News February 17, 2025

కుంభమేళాలో అనకాపల్లి ఎంపీ

image

అనకాపల్లి ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సీఎం రమేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్‌రాజ్ వెళ్లారు. మహా కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. మహావిష్ణు, పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఎంపీ మాట్లాడుతూ.. కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 22, 2025

డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి జగన్ లేఖ

image

AP: డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రధాని మోదీని మాజీ CM జగన్ కోరారు. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే సౌత్ భాగస్వామ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలు అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలని పేర్కొన్నారు. LS, RSలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా జాగ్రత్త పడాలన్నారు.

News March 22, 2025

IPL: ఆర్సీబీపై KKRదే డామినేషన్

image

నేటి నుంచి 65 రోజుల పాటు ఐపీఎల్ 2025 జరగనుంది. తొలి మ్యాచ్ ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరగనుండగా ఇరు జట్లు ఇప్పటివరకు 34 సార్లు తలపడ్డాయి. వీటిలో 20 సార్లు KKR విజయం సాధించగా ఆర్సీబీ 14 సార్లు గెలుపొందింది. చివరి సారిగా ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచులో కేకేఆర్ గెలుపొందింది. రెండింటి మధ్య జరిగిన మ్యాచుల్లో కోహ్లీ(962) అత్యధిక పరుగులు చేశారు. మరి ఇవాళ్టి మ్యాచులో ఏ జట్టు డామినేట్ చేస్తుందో చూడాలి.

News March 22, 2025

డీలిమిటేషన్‌పై వారి మౌనం సరికాదు: షర్మిల

image

AP: డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జనాభా ఆధారంగా సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమేనని తెలిపారు. సౌత్‌లో చేసే మొత్తం సీట్ల పెంపు, బిహార్, యూపీలోని సీట్ల పెంపు కన్నా తక్కువేనని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌పై చంద్రబాబు, పవన్, జగన్ మౌనంగా ఉండటం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లేనని చెప్పారు.

error: Content is protected !!