News January 31, 2025

కుంభమేళాలో జగిత్యాలకు చెందిన మహిళలు మిస్సింగ్

image

జగిత్యాల జిల్లా విద్యానగర్‌కు చెందిన నరసవ్వ (55) కుటుంబ సభ్యులతో, కొత్తవాడకు చెందిన రాజవ్వ (55) తన బంధువులతో కలిసి ఈ నెల 29న మహా కుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా మహా కుంభమేళాలో భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా నరసవ్వ, రాజవ్వ ఇద్దరు మిస్సయ్యారు. అయితే, వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 3, 2025

భారత్ సిరీస్ పట్టేస్తుందా?

image

IND, SA మధ్య నేడు రాయ్‌పూర్‌లో రెండో వన్డే జరగనుంది. 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఇవాళ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అటు సిరీస్ ఫలితాన్ని 3వ వన్డేకు వాయిదా వేయాలనే పట్టుదలతో సఫారీ జట్టు ఉంది. గాయంతో తొలి వన్డేకు దూరమైన బవుమా జట్టులో చేరే ఆస్కారం ఉంది. రోహిత్, కోహ్లీ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. సుందర్ ప్లేస్‌లో తిలక్ జట్టులోకి రావొచ్చని టాక్. మ్యాచ్ 1.30PMకు మొదలవుతుంది.

News December 3, 2025

సూతకం అంటే మీకు తెలుసా?

image

ఓ ఇంట్లో జననం లేదా మరణం జరిగినప్పుడు పాటించే అశుభ్రత కాలాన్ని సూతకం అంటారు. కొత్త జననం జరిగినప్పుడు శిశువుకు, తల్లికి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరికీ శుద్ధి అయ్యే వరకు జనన సతకం ఉంటుంది. అలాగే, కుటుంబంలో ఎవరైనా మరణిస్తే.. వారి ఆత్మ శాంతించే వరకు కొన్ని రోజుల పాటు మరణ సూతకం పాటిస్తారు. ఈ సూతక కాలంలో ఇంటి సభ్యులు దేవాలయాలకు వెళ్లరు. శుభకార్యాలు, పూజలు వంటివి చేయరు.

News December 3, 2025

VHTలో 2 మ్యాచులు ఆడనున్న కోహ్లీ!

image

విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ కనీసం 2 మ్యాచులు ఆడే అవకాశం ఉందని క్రీడావర్గాలు తెలిపాయి. DEC 24న ఆంధ్ర, 26న గుజరాత్‌తో జరిగే మ్యాచుల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించనున్నారని పేర్కొన్నాయి. ఈ 2 మ్యాచ్‌లకూ బెంగళూరు వేదిక కానున్నట్లు వెల్లడించాయి. విరాట్ చివరిసారి 2010 ఫిబ్రవరిలో VHTలో ఆడారు. తాజా సీజన్‌లో మరోసారి ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తారని ఇప్పటికే ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డ్ వెల్లడించింది.