News January 31, 2025
కుంభమేళాలో జగిత్యాలకు చెందిన మహిళలు మిస్సింగ్

జగిత్యాల జిల్లా విద్యానగర్‌కు చెందిన నరసవ్వ (55) కుటుంబ సభ్యులతో, కొత్తవాడకు చెందిన రాజవ్వ (55) తన బంధువులతో కలిసి ఈ నెల 29న మహా కుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా మహా కుంభమేళాలో భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా నరసవ్వ, రాజవ్వ ఇద్దరు మిస్సయ్యారు. అయితే, వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 4, 2025
విచారణ ఇంత జాప్యమా… వ్యవస్థకే సిగ్గుచేటు: SC

యాసిడ్ దాడి కేసుల విచారణ డేటాను సమర్పించాలని అన్ని హైకోర్టులను SC ఆదేశించింది. ఢిల్లీ కోర్టులో 16 ఏళ్ల నాటి ఓ కేసు విచారణ ఇప్పటికీ పూర్తికాకపోవడంపై CJI సూర్యకాంత్ అసంతృప్తి వ్యక్తపరుస్తూ ఇది వ్యవస్థకే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. 2009లో యాసిడ్ దాడిలో గాయపడిన ఓ యువతి తన ఆవేదనను SCకి వినిపించారు. ముఖంపై యాసిడ్ దాడితో వైకల్యంతో పాటు దాన్ని తాగించిన ఘటనల్లో పలువురు ఆహారాన్నీ తీసుకోలేకపోతున్నారన్నారు.
News December 4, 2025
తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్

AP: TDP ఆధిపత్యపోరులో జరిగిన హత్య ఘటనలో పిన్నెల్లి సోదరులను అరెస్టు చేశారని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. హతులు, హంతకులు TDP వాళ్లేనని స్వయంగా SPయే చెప్పారన్నారు. ఇవే కాకుండా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ‘ఎక్కడైనా న్యాయం ఉందా? తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది’ అని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్‌పై CBN గతంలో ఒకలా మాట్లాడి ఇపుడు కార్మికుల్ని బెదిరిస్తున్నారని విమర్శించారు.
News December 4, 2025
పనిచేయని పోలీస్ వెబ్ సైట్లు.. ప్రజలకు ఇబ్బందులు

TG: సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్‌లు పనిచేయకపోవడంతో ఆన్‌లైన్ ఫిర్యాదుల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్ తర్వాత కేటుగాళ్లు పోలీస్ సైట్లలో లింకులు ఓపెన్ చేస్తే బెట్టింగ్ సైట్‌లకు రీడైరెక్ట్ అయ్యేలా చేశారు. దీంతో ముందు జాగ్రత్తగా ఐటీ విభాగం సర్వర్లను తాత్కాలికంగా డౌన్ చేసింది. అంతకుముందు మంత్రుల వాట్సాప్ గ్రూపులు కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.


