News February 27, 2026
కుంభమేళా రేంజ్‌లో గోదావరి పుష్కరాలు

AP: 2027 గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో నిర్వహించాలని దేవాదాయ శాఖమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘ భేటీలో నిర్ణయించారు. జూన్ 26 నుంచి జులై 7 వరకు 6 జిల్లాల్లో ఈ వేడుకలు జరుగుతాయి. సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. 369 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం టెంట్ సిటీలు, హోమ్ స్టేలు సిద్ధం చేయడంతో పాటు 434 ఆలయాలకు మరమ్మతులు చేయనున్నారు.
Similar News
News April 14, 2026
BSNLలో 120 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణకు ఏప్రిల్ 16-23 వరకు అవకాశం ఉంటుంది. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: bsnl.co.in చూడండి.
News April 14, 2026
ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఛార్జీలు తగ్గింపు!

ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను సవరించినట్లు అధికారులు తెలిపారు. గతంలో TG బస్సుల్లో దూరాన్ని బట్టి ఛార్జీలు రూ.20-130 అధికంగా ఉండేవి. ఇకపై వాటిని తగ్గించి APSRTC ఛార్జీల మేరకే వసూలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి రోజూ విజయవాడ, తిరుపతి, కర్నూలు, విశాఖకు వందలాది తెలంగాణ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే.
News April 14, 2026
మరోసారి శాంతి చర్చలు..? తగ్గిన క్రూడాయిల్ ధర

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఊగిసలాడుతున్నాయి. మరోసారి US-ఇరాన్ శాంతి <<19644378>>చర్చలకు<<>> అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇవాళ రేట్లు తగ్గాయి. నిన్న $100 పైగా ఎగిసిన బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేట్ $97కు పడిపోయింది. నేచురల్ గ్యాస్, గ్యాసోలిన్, హీటింగ్ ఆయిల్ ధరలు కూడా కాస్త దిగివచ్చాయి. అయితే నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు మాత్రం మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.


