News February 21, 2025
కుంభాభిషేక కార్యక్రమానికి కేసీఆర్కు ఆహ్వానం

యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక కార్యక్రమానికి రావాల్సిందిగా ఆలయ పూజారులు శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 23న మహా కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుందని కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
Similar News
News February 23, 2025
BHPL: మహా శివరాత్రి.. మరో 3 రోజులే!

శివరాత్రి వేడుకలకు ఓరుగల్లు పెట్టింది పేరు. WGL నగరంలోని వేయి స్తంభాల గుడి, సిద్ధేశ్వరాలయం, మెట్టుగుట్ట సహా పలు దేవాలయాలు భక్తులతో పండుగరోజు నిండిపోతాయి. ఐనవోలు(HNK), రామప్ప(ములుగు), కాళేశ్వరాలయం(BHPL), పాలకుర్తి సోమేశ్వర(జనగామ), కురవి వీరభద్రస్వామి(MHBD) దేవాలయాలు జాగారం ఉన్న శివ భక్తులతో కిటకిటలాడతాయి. రాత్రంతా భక్తుల భజనలు, కీర్తనలతో దద్దరిల్లుతాయి. మీరు ఏ గుడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
News February 23, 2025
కొండపి: సొంత చెల్లినే గర్భవతి చేసిన అన్న

మానవ సంబంధాలను మంట గలిపే దారుణ ఘటన కొండపి మండలంలో వెలుగు చూసింది. విజయవాడలోని తల్లి వద్ద ఉంటున్న పెద్ద చెల్లిని, అన్న గతేడాది క్రిస్మస్కు పెట్లూరుకు తీసుకొచ్చాడు. పండగ అనంతరం చెల్లిని విజయవాడలో వదిలిపెట్టకుండా తన వెంట హైదరాబాద్ తీసుకువెళ్లాడు. కొన్నాళ్లకు అనారోగ్యంతో తల్లి వద్దకు చేరుకున్న కుమార్తెకు వైద్య పరీక్షలు చేయగా గర్భవతి అని తేలింది. విషయం తల్లికి చెప్పడంతో కేసు పెట్టింది.
News February 23, 2025
ఏప్రిల్ 29న NCET.. నోటిఫికేషన్ విడుదల

2025-26లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి NCET(నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి తెలిపింది. APR 29న దేశవ్యాప్తంగా తెలుగు సహా 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తామంది. ర్యాంక్ ఆధారంగా 64 IIT, NIT, కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొంది.
వెబ్సైట్: <