News March 27, 2025
కుక్కునూరులో 108 ఉద్యోగి పై కేసు నమోదు

కుక్కునూరులోని 108 ఉద్యోగి అజిత్ కుమార్, పీహెచ్ సీలోని ఓ మహిళా ఉద్యోగిపై అత్యాచారం చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై బుధవారం కేసునమోదు చేసినట్లు HC నాగేశ్వరరావు తెలిపారు. మహిళ సన్నిహితంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ఒంటరిగా ఉంటున్న ఆమె రూమ్‌కి వచ్చి, బలాత్కారం చేశాడు. మరుసటి రోజు నుంచి ఫోన్ చాటింగ్ ద్వారా వేధించడం మొదలు పెట్టి, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
Similar News
News October 15, 2025
నారాయణపేటలో విద్యార్థుల ఆగ్రహం

జిల్లాలోని పలు గ్రామాలకు నిలిపివేసిన బస్ సర్వీసులను పునఃప్రారంభించాలని బుధవారం నారాయణపేట ఆర్టీసీ డిపోలో సీఐ అలివేలుతో PDSU, SFI నేతలు వాగ్వాదానికి దిగారు. గ్రామాలకు వెళ్లాల్సిన బస్సులను ఆదాయం కోసం ఇతర పట్టణాలకు పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బస్ సర్వీసులు లేక, ప్రైవేట్ వాహనాలకు ఛార్జీలు చెల్లించక పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని జిల్లా కోశాధికారి మహేశ్ ఫైర్ అయ్యారు.
News October 15, 2025
రేషన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు!

తెనాలిలోని పలు రేషన్ దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 15వ తేదీ వరకు రేషన్ పంపిణీకి అవకాశం ఉన్నా కొన్నిచోట్ల బియ్యం స్టాకు లేదంటూ బోర్డులు పెట్టేస్తుండటంతో ప్రజలు నిరాశతో వెనుతిరుగుతున్నారు. కొందరు డీలర్లు ఈ నెల స్టాక్ తక్కువగా వచ్చిందని చెబుతూ కార్డుదారుల వేలిముద్ర తీసుకుని బియ్యంకి బదులు కిలోకి రూ.10 చొప్పున ఇచ్చి పంపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మీ ఊర్లోనూ ఈ పరిస్థితి ఉందా?
News October 15, 2025
KNR: గుండెపోటు.. ఆ క్షణాలు చాలా కీలకం

గుండెపోటు సమయంలో అవలంబించవలసిన CPR(కార్డియో పల్మనరీ రెసీసీకేషన్) పద్ధతిపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈనెల 13 నుంచి 17 వరకు CPR అవగాహన వారోత్సవాల సందర్భంగా KNR ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ నిర్వహిస్తున్నారు. బుధవారం కలెక్టర్ హాజరై మాట్లాడారు. గుండెపోటు సంభవించిన సమయంలో మొదటి కొన్ని గోల్డెన్ సెకండ్లు వృథా చేయవద్దన్నారు.