News August 12, 2024
కుటుంబ కలహాలతో భర్త SUICIDE

కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నిడదవోలు మండలం గోపవరంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గోపవరానికి చెందిన మారిశెట్టి మహేశ్వరరావు(30) కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం అతడిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News November 28, 2025
ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే ఆరవెల్లి రాధాకృష్ణతో కలిసి ఆమె ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతుల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న నూతన నిర్మాణాలను పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ ఆమె వెంట ఉన్నారు.
News November 28, 2025
బాధితులకు రూ.1.85 కోట్లు అందజేత: కలెక్టర్

జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం జరిగిన విజిలెన్స్ కమిటీ సమావేశంలో డిసెంబర్ 24 నుంచి మే 25 వరకు బాధితులకు రూ.1.85 కోట్ల పరిహారం చెల్లించామని తెలిపారు. అట్రాసిటీ కేసులలో ఎఫ్ఐఆర్, చార్జిషీట్ నమోదులో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News November 28, 2025
భీమవరంలో మాక్ అసెంబ్లీ

మాక్ అసెంబ్లీ నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని హెచ్.ఎం. కె. కృష్ణకుమారి అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భీమవరంలోని ఝాన్సీలక్ష్మీబాయి మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థినులు గురువారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగం తయారు చేయడానికి ముందు, తర్వాత ప్రజల జీవన విధానం ఎలా ఉండేదో తెలిపే స్కిట్ను కూడా పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించారు.


