News June 14, 2024

కుటుంబ సభ్యులతో చంద్రబాబును కలిసిన అనిత

image

సీఎం చంద్రబాబును అమరావతి సచివాలయంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. హోమ్ మినిస్టర్‌గా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. నమ్మకం నిలబెట్టుకుంటానని చంద్రబాబుకు ఈ సందర్బంగా తెలిపారు.

Similar News

News October 27, 2025

విశాఖ: ‘29న‌ టిఫ‌న్, భోజ‌నం ప్యాకెట్ల‌ను సిద్దం చేసుకోవాలి’

image

ఈనెల 28న గంట‌కు 150-200 KM వేగంతో తుపాను తీరం దాటే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అజ‌య్ జైన్ పేర్కొన్నారు. సోమవారం విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. తీరం దాటే ప్ర‌భావంతో చాలా న‌ష్టం వాటిల్ల వ‌చ్చ‌ని, విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌వ‌చ్చ‌న్నారు. తుపాను ప్ర‌భావిత ప్రాంత ప్రజలకు అల్పాహారం, భోజ‌నం ప్యాకెట్ల‌ను అందించేందుకు యంత్రాంగం సంసిద్ధంగా ఉండాల‌ని ఆదేశించారు.

News October 27, 2025

విశాఖ: డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీడీగా కె.రజిత

image

విశాఖలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరక్టరుగా కె.రజిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె విజయనగరం, అనకాపల్లి ప్రాంత డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. 2013లో ఆమెకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2013 నుంచి 2016 వరకు అసిస్టెంట్ డైరెక్ట్‌గా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

News October 27, 2025

మొంథా తుపాన్‌పై జీవీఎంసీ అప్రమత్తం

image

మొంథా తుపాన్ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్లు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. నగరంలో 55 పునరావాస కేంద్రాలు, 20 క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటయ్యాయి. 29 జేసీబీలు, 82 స్ప్రేయర్లు, 64 ఫాగింగ్ మెషిన్లు, 26 ట్రీ కట్టర్లు సిద్ధంగా ఉంచారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోన్లలో కంట్రోల్ రూములు 24 గంటలు పనిచేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు.