News June 14, 2024
కుటుంబ సభ్యులతో చంద్రబాబును కలిసిన అనిత
సీఎం చంద్రబాబును అమరావతి సచివాలయంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. హోమ్ మినిస్టర్‌గా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. నమ్మకం నిలబెట్టుకుంటానని చంద్రబాబుకు ఈ సందర్బంగా తెలిపారు.
Similar News
News September 20, 2024
వరద బాధితులకు నెల జీతం విరాళంగా ఇచ్చిన స్పీకర్
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయవాడ వరద బాధితులకు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం చెక్కును సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ సామర్థ్యానికి తగ్గట్టు సీఎం రిలీఫ్ ఫండ్కు సహాయం అందించాలని కోరారు. వరద ప్రాంత బాధితులకు ఆ నిధులు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
News September 19, 2024
సింహాచలం ఈవోగా వి.త్రినాథరావు
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానమునకు కార్యనిర్వహణ అధికారిగా వి.త్రినాథరావును నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఉత్వర్వుల జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈవోగా పని చేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తన మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు తిరిగి వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో త్రినాథరావు వచ్చారు.
News September 19, 2024
స్వర్ణాంధ్ర-2047పై సమీక్ష నిర్వహించిన విశాఖ కలెక్టర్
స్వర్ణాంధ్ర-2047పై అందరికీ అవగాహన ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్లో గురువారం స్వర్ణాంధ్ర-2047పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐదేళ్లలో సాధించబోయే ప్రగతిపై ప్రణాళికలతో కూడిన నివేదికలను రూపొందించాలన్నారు. ప్రతి ఏటా 15% ఆర్థిక పురోగతి కనిపించాలన్నారు.