News March 9, 2025
కుప్పంలో గిట్టుబాటు ధరలు లేని బంతిపూలు

రైతులకు గిట్టుబాటు ధర లేక బంతిపూలను కుప్పం పురపాలక సంఘం పూలు మార్కెట్ నుంచి రైతులు టాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. బంతి పూలను జంతువులకు ఆహారంగా పెడుతున్నారు. మార్కెట్లో బంతిపూలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం వెంటనే పూల రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
Similar News
News March 10, 2025
పుత్తూరు: చినరాజుకుప్పంలో హత్య

నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణ పరిధిలోని చినరాజుకుప్పం గ్రామానికి చెందిన మణికంఠ (29) అనే యువకుడు ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News March 10, 2025
అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి: ఎమ్మెల్యే భానుప్రకాశ్

రాబోయే రోజుల్లో పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని నగరి ఎమ్మెల్యే భానుప్రకాశ్ అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్ధ ‘రాస్’ ఆధ్వర్యంలో పుత్తూరులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళల అభివృద్ధి కోసం ‘రాస్’ సంస్ధ చేపట్టిన కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శనీయమన్నారు. మహిళా సాధికారత సాధ్యం కావాలంటే సాంఘిక, ఆర్థిక, అధికారాల పంపిణీ జరగాలన్నారు.
News March 8, 2025
చిత్తూరు: వైసీపీ మహిళా విభాగంలో జిల్లా వాసుల నియామకం

చిత్తూరు జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర మహిళా అనుబంధ విభాగంలో చోటు లభించింది. రాష్ట్ర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా గీతా యాదవ్, జనరల్ సెక్రటరీలుగా గాయత్రీ దేవి, దాక్షాయిణి, స్పోక్స్ పర్సన్‌గా శ్రీదేవి రెడ్డి, కార్యదర్శులుగా మేరీ జయరాం, సరస్వతమ్మ, కల్పలత రెడ్డి, యమునమ్మ, ధనలక్ష్మిని నియమిస్తూ పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.