News June 22, 2024
కుప్పంలో చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇలా..!
ఈనెల 25న సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 12:30 గంటలకు పీఈఎస్ మెడికల్ కళాశాలకు చేరుకుంటారు. పట్టణంలో ఒంటిగంటకు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారు. 1.30 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సమావేశంలో మాట్లాడుతారు. 3:30 కి పీఈఎస్ ఆడిటోరియంలో జిల్లా, నియోజకవర్గస్థాయి అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.
Similar News
News November 14, 2024
నిమోనియా దినోత్సవ గోడపత్రిక ఆవిష్కరించిన చిత్తూరు కలెక్టర్
నిమోనియా దినోత్సవ గోడపత్రికను చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిమోనియా వ్యాధి లక్షణాలు, తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలపై వైద్య అధికారులు విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు గ్రామాలలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలన్నారు.
News November 13, 2024
తిరుపతి: యజమాని చనిపోయారని తెలియక..!
తిరుపతి జిల్లాలో కన్నీరు పెట్టించే ఫొటో ఇది. ఏర్పేడు(M) బండారుపల్లికి చెందిన యశోద పొలానికి వెళ్లారు. గడ్డిమోపు తెస్తుండగా తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ తగిలి కరెంట్ షాక్ కొట్టింది. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయం తెలియని పెంపుడు కుక్క ఆమె ఒడిలో అలాగే ఒదిగి ఉండిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు కంటతడి పెట్టారు.
News November 13, 2024
తిరుపతి: కరెంటు షాక్‌తో మహిళ మృతి
తిరుపతి జిల్లాలో విషాదం నెలకొంది. ఏర్పేడు(M) బండారుపల్లిలో కరెంటు షాక్‌తో యశోద మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఆమె పొలం నుంచి గడ్డిమోపు తెస్తుండగా.. తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ తగిలింది. దీంతో కరెంట్ షాక్ తగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె చనిపోయినప్పటికీ పెంపుడు కుక్క ఆమె ఒడిలో ఒదిగి ఉండడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఆమె మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.