News May 11, 2024
కుప్పంలో టీడీపీ, వైసీపీ నేతల కొట్లాట

కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురంలో శుక్రవారం రాత్రి టీడీపీ-వైసీపీకి చెందిన ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం పీఇఎస్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కుప్పం డి.ఎస్.పి శ్రీనాథ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 12, 2025
బైరెడ్డిపల్లి: మహిళపై అత్యాచారయత్నం

బైరెడ్డిపల్లి ఎన్టీఆర్ కాలనీలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరశురాముడు తెలిపారు. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అదే కాలనీకి చెందిన నాగరాజు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
News February 12, 2025
చిత్తూరు: టెన్త్ అర్హతతో 54 ఉద్యోగాలు

టెన్త్ అర్హతతో చిత్తూరు డివిజన్‌లో 54 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 11, 2025
చిత్తూరు జిల్లా హెడ్‌లైన్స్

✒నగరి ఎమ్మెల్యే సోదరుడు వైసీపీలో చేరికకు బ్రేక్!
✒ పుంగనూరులో యువకుడి సూసైడ్
✒టీడీపీ ఎంపీలపై మిధున్ రెడ్డి ఫైర్
✒ 158 ఏళ్ల చరిత్ర కలిగిన మసెమ్మ జాతరరేపే ప్రారంభం
✒శ్రీవారి సేవలో సినీ నటుడు కార్తీ
✒SPMVV: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
✒పెద్దిరెడ్డి ఓ దొంగ: MP శబరి