News June 5, 2024
కుప్పంలో 12 మందికి డిపాజిట్ గల్లంతు

సార్వత్రిక ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పోటీ చేసిన 12 మందికి డిపాజిట్ గల్లంతైంది. చంద్రబాబు 48, 184 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. చంద్రబాబుకు 1,20,925 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి భరత్ 73, 586 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల గోవిందరాజులు 2,562 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. నోటాకు 2,111 ఓట్లు వచ్చాయి.
Similar News
News January 7, 2026
9 నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో 9, 10 తేదీల్లో చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News January 6, 2026
చిత్తూరు: యూరియా వాడకంతో పాలు తగ్గుతాయి..!

ఐరాల మండలం చిన్నకంపల్లిలో జిల్లా వ్యవసాయ అధికారి మురళి ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ యూరియా వాడటంతో కలిగే నష్టాలను రైతులకు వివరించారు. తగిన మోతాదులో యూరియా వాడితేనే పంట దిగుబడి పెరుగి.. చీడ పీడలు తగ్గుతాయని చెప్పారు. వెటర్నరీ డాక్టర్ మాట్లాడుతూ.. పశుగ్రాసానికి యూరియా వాడకంతో పాలు, వెన్న శాతం తగ్గుతాయని తెలిపారు.
News January 6, 2026
చిత్తూరు జిల్లాలో తగ్గిన పంచాయతీలు

పునర్విభజన కారణంగా చిత్తూరు జిల్లాలో పంచాయతీల సంఖ్య భారీగా తగ్గిపోయింది. 696 పంచాయతీలున్న జిల్లాలో తాజాగా ఆ సంఖ్య 621కి తగ్గింది.75 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు వెళ్లాయి. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సదుం మండలాలను మదనపల్లె జిల్లాలో కలపడంతో 32గా ఉన్న మండలాల సంఖ్య 28కి తగ్గింది.


