News December 20, 2024
కుప్పంలో YCP అధినేత జగన్ జన్మదిన వేడుకలపై ఆంక్షలు

కుప్పం నియోజకవర్గంలో YCP అధినేత జగన్ జన్మదిన వేడుకలపై ఆంక్షలు విధిస్తూ సబ్ డివిజనల్ అధికారి ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో సీఎం భార్య భువనేశ్వరి పర్యటన 21 వరకు కొనసాగడం, అదే రోజు జగన్ పుట్టిన రోజు కావడంతో ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పార్టీ ఆఫీసులో మినహా మరెక్కడా వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేయకూడదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News November 21, 2025
చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక

చిత్తూరు జిల్లాలోని మున్సిపల్, ఎయిడెడ్, పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు HM అకౌంట్ టెస్టుకు ఈనెల 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో సూచించారు. ఓ పేపర్కు రూ.100, 2పేపర్ల పరీక్ష రాసేందుకు రూ.150 చెల్లించాలన్నారు. రూ.60 అపరాధ రుసుముతో నవంబరు 30వ తేదీ లోపు చెల్లించాలని సూచించారు.
News November 21, 2025
చిత్తూరు: రాగుల పంపిణీకి చర్యలు

చిత్తూరు జిల్లాలోని రేషన్ షాపుల్లో డిసెంబరు నెల నుంచి రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ లక్ష్మి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాకు 350 టన్నుల జొన్నలు, 350 టన్నుల రాగులను కేటాయించిందన్నారు. చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో వీటిని పంపిణీ చేస్తామన్నారు. కార్డుదారులకి ఇస్తున్న బియ్యం కోటాలో ఒక్కొక్క కేజీ వంతున రాగులు, జొన్నలు అందజేస్తామని చెప్పారు.
News November 21, 2025
వివాదస్పదంగా కొందరు విలేకరుల తీరు.!

చిత్తూరు జిల్లాలో కొందరు <<18340244>>విలేకరులు దందాలకు<<>> పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఇద్దరు విలేకరులు అగ్రికల్చరల్ మహిళా ఆఫీసర్ను బెదిరించగా కలెక్టర్ వారి అక్రిడిటేషన్ రద్దు చేశారు. తాజాగా GDనెల్లూరు సైతం ఇద్దరు విలేకరులు తనను బెదిరించారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రజలకు అండగా ఉండాల్సిన విలేకరులే ఇలా అడ్డదారులు తొక్కుతుంటే ఎలా అని పలువురు మండిపడుతున్నారు.


