News July 17, 2024
కుప్పం ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు

చిత్తూరు జిల్లా కుప్పంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కుప్పంతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. కాగా చిన్నతరహా ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి AAI వర్గాలు సూచించాయి.
Similar News
News November 3, 2025
అడవి పందుల కోసం వేట.. ఇద్దరి మృతి

బంగారుపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. బండ్లదొడ్డి గ్రామపంచాయతీలో వన్య ప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఒక అడవి పంది కూడా చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News November 3, 2025
చిత్తూరు: వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారి పాల్గొన్నారు.
News November 3, 2025
మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్య ప్రవర్తన

ఓ మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇది. అలిపిరి PS పరిధిలో ఓ మహిళ బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసుకుంది. ఆమెను ఇంటి వద్దకు చేర్చిన రైడర్ పెద్దయ్య అనంతరం ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నిందితుడిని పట్టుకుని నైట్ బీట్లో ఉన్న అలిపిరి CI రామకిశోర్‌కు అప్పగించారు.


