News November 6, 2024
కుప్పం : ఓడిన అభ్యర్థి పుట్టినరోజు నాడే గెలిచిన అభ్యర్థి రాజీనామా

టీడీపీ కుప్పం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన త్రిలోక్ పుట్టినరోజు నాడే మున్సిపల్ ఛైర్మన్‌గా గెలుపొందిన డా.సుధీర్ రాజీనామా చేయడం స్థానికంగా చర్చనీయంగా మారింది. వ్యక్తిగత కారణాల నేపథ్యంలో డా.సుధీర్ వైసీపీతో పాటు మున్సిపల్ ఛైర్మన్ , కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మున్సిపల్ చైర్ పర్సన్‌గా త్రిలోక్ సతీమణి భాగ్యలక్ష్మికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
Similar News
News December 29, 2025
చిత్తూరు: ఒకే రోజు రూ.1.25 కోట్ల వసూలు

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు పనిచేశాయి. దీంతో రెండు జిల్లాల నుంచి 11,200 మంది వినియోగదారులు కరెంటు బిల్లులు చెల్లించారు. తద్వారా సంస్థకు రూ.1.25 కోట్ల ఆదాయం వచ్చిందని ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, చంద్రశేఖర్ రావు తెలిపారు. సకాలంలో బిల్లులు చెల్లించి జరిమానాలకు దూరంగా ఉండాలని వినియోగదారులకు సూచించారు.
News December 29, 2025
చిత్తూరు జిల్లాలో కనపడని మామిడి పూత..!

చిత్తూరు జిల్లాలో మంచు ప్రభావంతో మామిడి తోటల్లో ఇంతవరకు పూత కనబడటం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1.65 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నాటికి తోటల్లో మామిడి పూత వస్తుంది. ఈసారి మంచు అధికంగా ఉండటంతో ఇప్పటివరకు పూత కనిపించ లేదు. రైతులు వేలాది రూపాయలు వ్యయం చేసి మందులు పిచికారీ చేస్తున్నారు.
News December 29, 2025
చివరి గ్రీవెన్స్‌ను పబ్లిక్ సద్వినియోగం చేసుకోండి : జిల్లా ఎస్పీ

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (PGRS) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసేందుకు ఇది ఎంతగానో అనుకూలమైన కార్యక్రమం అన్నారు. ఈ ఏడాదిలో ఇదే చివరి పీజీఆర్ఎస్.


