News March 3, 2025
కుప్పం : చికెన్ పట్ల అపోహలు వద్దు : ఎమ్మెల్సీ

చికెన్ పట్ల సామాజిక మాధ్యమంలో వస్తున్న అపోహలను నమ్మొద్దని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం టీడీపీ కార్యాలయ సమీపంలో ఆదివారం సాయంత్రం చికెన్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం ప్రారంభించారు. చికెన్, కోడిగుడ్లలో మంచి ప్రోటీన్లు దొరుకుతుందని, అపోహలను పక్కనపెట్టి చికెన్ తినొచ్చని అన్నారు.
Similar News
News March 21, 2025
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మిథున్ రెడ్డి భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. గురువారం పార్లమెంటు భవనంలో కలిశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలతో పాటు ఇతర అంశాలు కూడా చర్చించారు. ఆయనతో పాటు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఉన్నారు.
News March 21, 2025
పులిచెర్ల: నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కల్లూరు పోలీసులకు సమాచారం అందడంతో వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక కారు ఆగకుండా వెళ్లడంతో వెంబడించి పట్టుకున్నారు. కారు, నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు.
News March 21, 2025
14400కు కాల్ చేయండి: చిత్తూరు కలెక్టర్

చిత్తూరు జిల్లాలో సారా నిర్మూలనకు సమష్టి కృషి అవసరమని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో నవోదయం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. నవోదయం 2.0 ద్వారా సారా నిర్మూలనకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా సారా తయారీ చేసినా, విక్రయించినట్లు తెలిసినా ప్రజలు 14400 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఎస్పీ మణికంఠ, ఎక్సైజ్, ఫారెస్ట్, రెవెన్యూ, అధికారులు పాల్గొన్నారు.