News March 2, 2025
కుప్పం టౌన్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఎత్తివేత

కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ పెట్టిన ఆంక్షలు ఎత్తివేసినట్లు పీఐసీ ఛైర్మన్ బ్రహ్మానందరెడ్డి, బ్యాంకు మేనేజర్ శివకృష్ణ పేర్కొన్నారు. ఇకపై బ్యాంకులో మోర్టగేజ్, గోల్డ్, హౌసింగ్ లోన్స్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మార్చి తర్వాత షేర్ హోల్డర్లకు చెల్లించాల్సిన డిపెండెంట్లు సైతం చెల్లిస్తామని, బ్యాంకు పరిధిలో పేరుకుపోయిన సుమారు రూ.3 కోట్ల బకాయిలను రికవరీ చేసినట్లు వారు తెలిపారు.
Similar News
News October 27, 2025
చిత్తూరు జిల్లాలో రేపు కూడా స్కూళ్లకు సెలవు

చిత్తూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు మంగళవారం సైతం సెలవును ప్రకటించినట్లు DEO వరలక్ష్మి తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు గమనించాలని కోరారు.
News October 27, 2025
చిత్తూరులో పటిష్ఠ బందోబస్తు

గత మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో సోమవారం నిందితులకు శిక్ష ఖరారు కానున్న నేపథ్యంలో చిత్తూరులో పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చిత్తూరు 1, 2 టౌన్ స్టేషన్ల పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా కోర్టు పరిధిలో లాయర్లు సిబ్బందిని తప్ప మరెవరిని అనుమతించామన్నారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు.
News October 26, 2025
చిత్తూరు జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు సెలవు పాటించాలని అందులో ఆదేశించారు. తల్లిదండ్రులు పిల్లలను నదులు, కాలువలు దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.


