News August 18, 2024
కుప్పం: ట్రాక్టర్ చోరీ కేసులో వైసీపీ నేతల అరెస్ట్
కుప్పం(M) మల్లానూరు సచివాలయం ట్రాక్టర్ చోరీ కేసులో వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. ట్రాక్టర్ కనపడటం లేదని జనవరి 23న పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 25న కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వైసీపీ కుప్పం మండల అధ్యక్షుడు హెచ్ఎం మురుగేశ్, ఆయన కుమారుడు శ్రీనివాసులును శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు.
Similar News
News September 14, 2024
చిత్తూరు SP స్ట్రాంగ్ వార్నింగ్
ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరించారు. మొగిలిలో ప్రమాద ఘటనను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రహదారి లోపాలను సరిదిద్దడం, భారీ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరణ చేయడం లాంటి చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News September 14, 2024
చిత్తూరు జిల్లా రైతులకు గమనిక
చిత్తూరు: సరైన వర్షపాతం లేని కారణంగా పంటలు నీటి ఎద్దడికి గురవుతున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. పంట నష్ట నివారణకు జిల్లా రైతాంగం వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని కోరారు. రెండు శాతం యూరియా ద్రావణం, 10రోజల వ్యవధిలో 19-19-19 ఎరువును రెండుసార్లు పిచికారీ చేయాలని సూచించారు. స్పింకర్ల ద్వారా నీరు పిచికారీ చేయాలన్నారు.
News September 14, 2024
వరద బాధితులకు తిరుపతి అధికారుల సాయం
విజయవాడ వరద బాధితులకు తిరుపతి జిల్లా అధికారులు అండగా నిలిచారు. ఎంపీడీవోలు, పంచాయతీ రాజ్ శాఖ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున తమ వంతు సాయం చేశారు. కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌ను కలిసి రూ.7.47 లక్షల చెక్కును శుక్రవారం అందజేశారు.