News July 26, 2024
కుప్పం: ఫలితాలు విడుదల

కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో యూజీ, పీజీ పరీక్ష ఫలితాలను ఇన్‌ఛార్జ్ వీసీ ప్రొ.ఎం. దొరస్వామి విడుదల చేశారు. వీసీ మాట్లాడుతూ జూన్, జులై 2024లో నిర్వహించిన యూజీ (బిఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ), పీజీ (ఏంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ) మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పరీక్ష ఫలితాలను https://www.dravidianuniversity.ac.in/లో చూసుకోవచ్చని సూచించారు.
Similar News
News November 26, 2025
భూపతి మృతిపట్ల CM చంద్రబాబు విచారం

రామకుప్పం(M) వీర్నమలకు చెందిన వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ భూపతి మృతి పట్ల CM చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. భూపతి విద్యుత్ షాక్‌తో మృతి చెందడం బాధాకరమని, వార్డు మెంబర్, గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కోసం ఎంతగానో కష్టపడి పని చేశారని గుర్తు చేసుకున్నారు. అలాంటి యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందడం బాధాకరమన్నారు. భూపతి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని CM అన్నారు.
News November 26, 2025
చిత్తూరు: టెన్త్ హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్

టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్‌పై పరీక్షా కేంద్రాన్ని తెలిపే క్యూఆర్ కోడ్‌ను ముద్రించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు కేంద్రాలను గుర్తించడం సులభతరం కానుంది. చిత్తూరు జిల్లాలోని 535 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 22 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు 122 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.
News November 26, 2025
3 ముక్కలుగా పుంగనూరు..!

మదనపల్లె జిల్లాలోకి పుంగనూరును మార్చనున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని 6మండలాలను 3రెవెన్యూ డివిజన్ల పరిధిలోకి చేర్చనున్నారు. పుంగనూరు, చౌడేపల్లె మండలాలు మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేయనున్నారు. సోమల, సదుం కొత్త డివిజన్ పీలేరులో కలుస్తాయి. పులిచెర్ల, రొంపిచర్ల మండలాలను చిత్తూరు డివిజన్‌లోనే కొనసాగించనున్నారు. ఎల్లుండి జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకుంటారు.


