News August 10, 2024

కుప్పం : బస్సు కదలాలంటే.. నెటాల్సిందే!

image

కుప్పం ఆర్టీసీ డిపో పరిధిలో డొక్కు బస్సులతో ప్రయాణికులకు నిత్యం అగచాట్లు తప్పడం లేదు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత కుప్పం ఆర్టీసీ డిపో పరిధిలో 50 కి పైగా బస్ సర్వీసులను పెంచారు. కండీషన్‌లో లేని బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కుప్పం క్రిష్ణగిరి మధ్య రాకపోకలు సాగించే అంతర్ రాష్ట్ర బస్ శనివారం ఆర్టీసీ బస్టాండ్లో మొరాయించడంతో ఇదిగోండి ఇలా తోసి స్టార్ట్ చేశారు.

Similar News

News April 12, 2026

తిరుపతి గంగమ్మ జాతర ఎప్పుడంటే?

image

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 5న చాటింపుతో ప్రారంభం కానుంది. 6వ తేదీ భైరాగి వేషం, 7న బండ వేషం, 8న తోటి వేషం, 9న దొర వేషం, 10న మాతంగి వేషాలు ఉంటాయి. 11న సున్నపు కుండలు, 12న జాతర, 13న అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. జాతర పోస్టర్లను ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆదివారం ఆవిష్కరించారు.

News April 12, 2026

చిత్తూరు: ప్రవేశాలకు గడువు పెంపు

image

చిత్తూరు జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 20కి పొడిగించినట్టు సమగ్ర శిక్ష ఏసీపీ వెంకటరమణ తెలిపారు. జిల్లాలోని ఏడు కేజీబీవీ పాఠశాలల్లో 10వ తేదీ వరకు 6వ తరగతికి 693, ఇంటర్ ఫస్టియర్‌కు 670 దరఖాస్తులు అందాయని చెప్పారు. గడువు పెంపు అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.