News January 5, 2025
కుప్పం: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
చెన్నై-బెంగళూరు రైల్వే మార్గంలోని కుప్పం మండలం గుల్లెపల్లి సమీపంలో శనివారం గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 9, 2025
తిరుపతి రుయాలో పోస్ట్మార్టం
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. వీరందరికీ మరికాసేపట్లో రుయా ఆసుపత్రిలోని మార్చురీలో పోస్ట్మార్టం చేయనున్నారు. స్విమ్స్లో చనిపోయిన ఇద్దరు, రుయాలో చనిపోయిన నలుగురి మృతదేహాలకు ఇక్కడే శపపరీక్ష చేసి బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే బంధువులు మార్చురీ వద్దకు చేరుకుని బోరున విలపిస్తున్నారు.
News January 9, 2025
తిరుపతి ఘటన బాధాకరం: AP గవర్నర్
తిరుపతిలో బుధవారం క్యూ లైన్లలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం, పలువురు గాయపడిన ఘటనపై AP గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
News January 9, 2025
చంద్రబాబు రాజీనామా చేయాలి: రోజా
తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మాజీ మంత్రి రోజా అన్నారు. ‘ఈ ప్రభుత్వానికి సామాన్య ప్రజలంటే ఇంతటి నిర్లక్ష్యమా? ఘటనపై కేంద్రం కలగజేసుకొని నిర్లక్ష్యం వహించిన TTD ఛైర్మన్, ఈవో, ఎస్పీ, ఇతర అధికారులపై కేసు నమోదు చేయాలి. అధికార యంత్రాంగాన్ని తన పర్యటనలో వినియోగించుకుని ఇంతమంది చావుకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి’ అని రోజా డిమాండ్ చేశారు.