News July 11, 2024
కుప్పం: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్పై కేసు నమోదు

కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్పై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 28, 2025
చిత్తూరు జిల్లాలో నేడు కూడా స్కూళ్లకు సెలవు

చిత్తూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు మంగళవారం సైతం సెలవును ప్రకటించినట్లు DEO వరలక్ష్మి తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు గమనించాలని కోరారు.
News October 27, 2025
చిత్తూరు జిల్లాలో రేపు కూడా స్కూళ్లకు సెలవు

చిత్తూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు మంగళవారం సైతం సెలవును ప్రకటించినట్లు DEO వరలక్ష్మి తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు గమనించాలని కోరారు.
News October 27, 2025
చిత్తూరులో పటిష్ఠ బందోబస్తు

గత మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో సోమవారం నిందితులకు శిక్ష ఖరారు కానున్న నేపథ్యంలో చిత్తూరులో పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చిత్తూరు 1, 2 టౌన్ స్టేషన్ల పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా కోర్టు పరిధిలో లాయర్లు సిబ్బందిని తప్ప మరెవరిని అనుమతించామన్నారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు.