News July 11, 2024
కుప్పం: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌పై కేసు నమోదు

కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌పై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 20, 2025
తవణంపల్లి MRO ఆఫీసులో JC విద్యాధరి తనిఖీలు

తవణంపల్లి MRO ఆఫీసును బుధవారం జాయింట్ కలెక్టర్ విద్యాధరి పరిశీలించారు. ఈ మేరకు ఆమె ఆఫీసులోని రికార్డులను తనిఖీ చేశారు. భూముల రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతుల సమస్యలపై ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మార్వోకు సూచించారు. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు సకాలంలో అందుతున్నాయా అని ఆరా తీశారు.
News February 19, 2025
చిత్తూరు జిల్లాలో TODAY TOP NEWS

✒ చిత్తూరు జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు
✒ డాక్టర్లకు చిత్తూరు కలెక్టర్ వార్నింగ్
✒ పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి
✒ పెనుమూరు: MLA హామీ.. తప్పిన ప్రమాదం
✒ పలమనేరు: బాలిక మృతి కేసులో డీఎస్పీ విచారణ
✒ తవణంపల్లి మండలంలో ముగ్గురి అరెస్ట్
✒ బూతులతో రెచ్చిపోయిన టీటీడీ బోర్డు సభ్యుడు
News February 19, 2025
ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు ఇద్దరు విద్యార్థుల ఎంపిక

ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు పులిచెర్ల మండలం కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్టు హెచ్ఎం శ్రీవాణి తెలిపారు. షాహిస్తా తబుసం, యశ్రబ్ స్కాలర్షిప్‌కు ఎంపికైనట్టు ఆమె వెల్లడించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో నిర్వహించిన పరీక్షకు పాఠశాల నుంచి 25 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించింది.