News August 1, 2024
కుప్పం: 18 మంది సస్పెండ్

సీఎం చంద్రబాబు సమక్షంలో నిన్న టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు ఎంపీటీసీలను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ భరత్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేసిన కుప్పం, గుడిపల్లి, శాంతిపురం మండలాలకు చెందిన 13 మంది ఎంపీటీసీలతో పాటు కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
Similar News
News December 3, 2025
చిత్తూరు: 10Th, ఇంటర్ చదవాలని అనుకుంటున్నారా?

చిత్తూరు జిల్లాలోని ఓపెన్ స్కూల్లో 10వ తరగతి, ఇంటర్ చదివేందుకు ఈనెల 10వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్లు పొందేవారు ఫీజుతో పాటు తాత్కాల్ రుసుం రూ.600 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు జిల్లాలోని కోఆర్డినేటర్ సెంటర్లు, డీఈవో కార్యాలయంలోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ను సంప్రదించాలని సూచించారు.
News December 3, 2025
చిత్తూరు జిల్లా చిన్నది అవుతుందనే..!

నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉంది. MLA భానుప్రకాశ్ సైతం ఇదే అంశంపై పోరాడారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. చిత్తూరు జిల్లాలో 31మండలాలు ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని 4 మండలాలను మదనపల్లె జిల్లాలో కలిపారు. నగరిలోని 3 మండలాలను తిరుపతిలో కలిపిస్తే 24 మండలాలతో చిత్తూరు జిల్లా చిన్నది అవుతుంది. అందుకే నగరి మండలాలను చిత్తూరు జిల్లాలోనే కొనసాగిస్తున్నారని సమాచారం.
News December 3, 2025
4న చిత్తూరు జిల్లాకు పవన్ రాక..?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 4న చిత్తూరులో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు. చిత్తూరు డీడీవో కార్యాలయాన్ని ఆయన నేరుగా ప్రారంభిస్తారు. వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా డీడీవో కార్యాలయాలను ఓపెన్ చేస్తారు. ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


