News September 27, 2024
కుబీర్: ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై అత్యాచారం
ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై అత్యాచారం జరిగిన ఘటన గురువారం నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఒంటరిగా ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన జాదవ్ సాహెబ్ రావు ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారం చేసి పారిపోయినట్లు తెలిపారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News October 11, 2024
ADB: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి
ADB, NRML, MNCL, ASFB జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
News October 11, 2024
ADB: అమ్మవారి రూపంలో హారతి
ఆదిలాబాద్ పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదర్శ్ దుర్గాదేవి మండలి వద్ద గురువారం రాత్రి దుర్గాదేవికి కాలనీవాసులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం పూజారి హారతి ఇవ్వగా దుర్గమ్మ రూపంలో కనిపించిందంటూ భక్తులు చర్చించుకున్నారు. అదే సమయంలో హారతిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
News October 11, 2024
ఆదిలాబాద్: ఉపకార వేతనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
2024- 25 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాల మంజూరు కోసం ఈ-పాస్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు రెన్యూవల్, ఫ్రెష్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హుడైన విద్యార్థి పేరు SSC మెమోలో ఉన్న విధంగా ఆధార్ కార్డులో ఉండాలన్నారు. విద్యార్థుల ఆదాయపరిమితి రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు పెంచామని చెప్పారు.