News March 18, 2025
కుబీర్: కరెంట్ షాక్తో రైతు మృతి

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం సిర్పెల్లి(H) గ్రామానికి చెందిన పబ్బు గణేశ్ (48) సోమవారం వ్యవసాయ భూమిలో మొక్కజొన్నకు నీరు ఇవ్వడానికి వెళ్లాడు. ఇంటికిరాలేదని తన కుమారుడు చేన్లోకి వెళ్లి చూడగా కరెంట్ షాక్కు గురై గణేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
Similar News
News September 15, 2025
కృష్ణా జిల్లాలో ఇంటి స్థలం కోసం 19,382 దరఖాస్తులు

కృష్ణా జిల్లాలో గృహ సముదాయాల కోసం ఇప్పటివరకు 19,382 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారుల సమాచారం ప్రకారం.. గుడివాడ డివిజన్లో 3,364 మంది, మచిలీపట్నం డివిజన్లో 6,083 మంది, ఉయ్యూరు డివిజన్లో 9,935 మంది ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. అయితే, స్థలాల కేటాయింపు, పట్టాల పంపిణీపై స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
News September 15, 2025
గ్రామాల్లో మహిళా ఓటర్లే అత్యధికం: ఈసీ

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో గ్రామీణ జనాభా 1.95 కోట్లకు గానూ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు 5,763 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలను వెల్లడించింది. వీరిలో మహిళా ఓటర్లు 85,35,935 మంది కాగా పురుషులు 81,66,732 మంది ఉన్నారని తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకుపైగా ఎక్కువని పేర్కొంది.
News September 15, 2025
ఘట్కాలో సత్తా చాటిన కృష్ణా జిల్లా క్రీడాకారులు

విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో సెప్టెంబర్ 13, 14 తేదీలలో జరిగిన 4వ రాష్ట్ర స్థాయి ఘట్కా పోటీలలో కృష్ణా జిల్లా క్రీడా కారులు తమ సత్తా చాటారు. మొత్తం ఏడు బంగారు, ఒక వెండి పతకం సాధించినట్లు జిల్లా ఘట్కా కార్యదర్శి మానికొండ చైతన్య తెలిపారు. పతకాలు సాధించిన 8 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ప్రముఖులు క్రీడా కారులను అభినందించారు.