News February 26, 2025

కుబీర్: గుండెపోటుతో లైన్ ఇన్స్పెక్టర్ మృతి

image

కుబీర్ మండలం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ దావు (56) గుండెపోటుతో మృతి చెందారు. దావు భార్య ఆరోగ్యం బాగలేకపోవడంతో నిజామాబాద్ ఆసుపత్రిలో రెండు రోజులుగా ఉంటున్నాడు. కాగా మంగళవారం గుండెపోటు రావడంతో అక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దావు మృతి పట్ల విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Similar News

News April 12, 2026

గోదావరి దాటి పోలవరం అడవుల్లోకి పెద్దపులి

image

పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ముంటూరు వద్ద పెద్దపులి గోదావరి దాటి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా వాడపల్లి, కొత్తూరు పరిసర కొండల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారి ఎస్కే వలీ ధ్రువీకరించారు. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు ఒంటరిగా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. పులికి హాని తలపెట్టకుండా సమాచారం అందించాలని అధికారులు కోరారు.

News April 12, 2026

పోలవరం అడవుల్లోకి మళ్లీ పెద్దపులి రాక

NTR: ఎం.ఫార్మసీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో FEB 2026లో నిర్వహించిన ఎం.ఫార్మసీ 1వ సెమిస్టర్ పరీక్షల (2025-26 విద్యా సంవత్సరం) రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోపు ఒక్కో పేపరుకు రూ. 1,100 ఫీజు http://www.onlinesbi.com/ వెబ్‌సైట్‌లో చెల్లించాల్సి ఉంటుందని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.