News March 23, 2025

కుబీర్: గుండెపోటుతో RMP వైద్యుడు మృతి

image

గుండెపోటుతో RMP వైద్యుడు మృతి చెందిన ఘటన కుభీర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. పార్డి(బి) గ్రామానికి చెందిన RMP వైద్యుడు పోతన్న రోజులాగే గ్రామంలో వైద్యం అందించి ఇంటికి తిరిగి వచ్చారు. శనివారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఇంట్లో కుప్పకూలాడు. గమనించిన ఆయన తల్లి, స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు వెల్లడించారు.

Similar News

News November 11, 2025

మా తండ్రి చనిపోలేదు: ఈషా డియోల్

image

తన తండ్రి ధర్మేంద్ర చనిపోలేదని కూతురు ఈషా డియోల్ ప్రకటించారు. ఆయన చనిపోయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ధర్మేంద్ర మృతికి సంతాపం తెలుపుతూ సినీ ప్రముఖులు పోస్టులు పెట్టడంతో ఫ్యాన్స్‌తో పాటు మీడియా వర్గాలు ఆయన చనిపోయినట్లు భావించాయి. అయితే తాజాగా ఆయన కూతురు ధర్మేంద్ర చనిపోలేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

News November 11, 2025

ఆదిలాబాద్‌‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటాల్ రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,750గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేటు ధర రూ.50 తగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.

News November 11, 2025

భద్రాద్రి సుదర్శన చక్రానికి 352 ఏళ్లు

image

భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం గోపురంపై ఉన్న సుదర్శన చక్రానికి విశిష్ట చరిత్ర ఉంది. కంచర్ల గోపన్న (భక్త రామదాసు) ఆలయ నిర్మాణం పూర్తవుతున్న 1674-1675 మధ్య కాలంలో శ్రీరాముడి ఆజ్ఞ మేరకు గోదావరిలో స్నానం చేస్తుండగా ఈ సుదర్శన చక్రం లభించింది. ఆనాటి నుంచి నేటి వరకు (352 ఏళ్లు) ఆలయ గోపురంపై ఇది కొనసాగుతోంది. ఈ చారిత్రక ఘట్టాన్ని భక్తులు స్మరించుకుంటున్నారు.