News November 3, 2024
కుబీర్: భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సాంవ్లి గ్రామానికి చెందిన భారత బాయి(32) అనే మహిళ తన భర్త రోజూ వేదించడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అన్న సాంగే ప్రకాష్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 23, 2026
ఆదిలాబాద్ గ్రీవెన్స్ డేలో 44 ఫిర్యాదులు: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 44 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు పరిష్కార ఆదేశాలు జారీ చేశారు. బాధితుల సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం 8712659973 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
News February 23, 2026
ఆదిలాబాద్: జాబ్ గ్యారంటీ కేంద్రాలుగా పాలిటెక్నిక్

పాలిటెక్నిక్‌లను జాబ్ గ్యారంటీ కేంద్రాలుగా ఉన్నతీకరించామని, ఉపాధి అవకాశాల కోసం వీటిలో చేరాలంటూ సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక ప్రచారం ప్రారంభించిందని ADB సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నరేశ్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు POLYCETపై అవగాహన కల్పించామన్నారు. ఈ సంవత్సరంకొత్త కోర్సులు అందుబాటులో వచ్చాయన్నారు.
News February 23, 2026
ఆదిలాబాద్: ఈ మండలాల్లో 2 రోజులు ‘భగీరథ’ నీటి సరఫరా బంద్

సీతగొండి వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు ఆదిలాబాద్ రూరల్, బేల, జైనాధ్, మావల, తంసి, భీమ్పూర్, తలమడుగు, గుడిహత్నూర్ మండలాల్లోని 406 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. దీనితో ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.


