News November 3, 2024

కుబీర్: భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

image

భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సాంవ్లి గ్రామానికి చెందిన భారత బాయి(32) అనే మహిళ తన భర్త రోజూ వేదించడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అన్న సాంగే ప్రకాష్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 7, 2024

నిర్మల్: బాలశక్తి కార్యక్రమాన్ని నిరంతరం పకడ్బందీగా కొనసాగించాలి: కలెక్టర్

image

బాలశక్తి కార్యక్రమాన్ని నిరంతరం పకడ్బందీగా కొనసాగించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాలశక్తి కార్యక్రమంపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. బాలశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, అన్ని రకాల పరీక్షలను నిర్వహించాలన్నారు.

News December 6, 2024

రేపటి ప్రోగ్రాంకు అందరికి ఆహ్వానం : ఆదిలాబాద్ SP

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజల పాలన ప్రజాపాలన విజయోత్సవ సంబరాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పిలుపునిచ్చారు. ఈనెల 7న ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో భారీ ఎత్తున ఏర్పాటు చేయనున్న విజయోత్సవ సంబరాల్లో ప్రజలు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, యువత పెద్దఎత్తున హాజరై కార్యక్రమాల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రోగ్రాంకు ప్రతిఒక్కరు ఆహ్వానితులేనన్నారు.

News December 4, 2024

మంచిర్యాల జిల్లాలో భూకంపం

image

మంచిర్యాల జిల్లాలోని పలు చోట్ల బుధవారం భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నస్పూర్, జైపూర్, చెన్నూర్ ప్రాంతాల్లో ఉదయం 7.25 గంటల సమయంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూప్రకంపనలతో ఒక్కసారిగా ఆందోళనలు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఎక్కడ ఎలాంటి నష్టం జరగలేదు.