News February 22, 2025

కుబీర్ మండలంలో వింత.. 8కాళ్లతో గొర్రె జననం

image

ఎనిమిది కాళ్లతో గొర్రె జన్మించిన వింత ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. కుబీర్‌లో బాలకిషన్ అనే రైతుకు చెందిన గొర్రె శుక్రవారం 8 కాళ్లు, ఒక తలతో కూడిన గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. కాగా పురిటిలోనే గొర్రె పిల్ల చనిపోయిందని రైతు తెలిపాడు. పశు వైద్యాధికారి విశ్వజిత్‌ను సంప్రదించగా జన్యుపరమైన లోపం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని తెలిపారు.

Similar News

News November 12, 2025

MHBD: ఆర్టీసీ ఆధ్వర్యంలో పంచారామ యాత్ర

image

MHBD డిపో నుంచి ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ నెల 16న పంచారామ యాత్ర టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ కళ్యాణి తెలిపారు. 40 సీట్ల డీలక్స్ బస్సు రాత్రి 11 గంటలకు బయలుదేరి, ఐదు పంచారామాల(అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట)ను సందర్శించి 18న తిరిగి చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.1,700 చొప్పున ధర నిర్ణయించినట్లు చెప్పారు.

News November 12, 2025

విదేశీ ఉద్యోగుల అవసరం ఉంది: ట్రంప్

image

H-1B వీసా జారీలో తెచ్చిన సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటమార్చారు. తమ దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయాలంటే ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల అవసరముందని పేర్కొన్నారు. అనుకున్న స్థాయిలో నైపుణ్యం కలిగిన వాళ్లు అమెరికాలో లేరని అంగీకరించారు. జార్జియాలోని రక్షణ రంగానికి చెందిన పరిశ్రమ నుంచి కార్మికులను తొలగించడంతో ఉత్పత్తుల తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.

News November 12, 2025

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు

image

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<>TISS<<>>) 2 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 16వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBDలకు రూ.125. వెబ్‌సైట్: https://tiss.ac.in