News February 24, 2025
కుబీర్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. భైంసా మండలం మిర్జాపూర్ సమీపంలో ఈ నెల 16న రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కుబీర్కు చెందిన సిందే సంతోష్ తలకు తీవ్రంగా గాయమైంది. కాగా నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంతోష్ ఆదివారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 21, 2025
23న పెళ్లి.. స్మృతికి మోదీ గ్రీటింగ్స్

స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 23న ఆమె తన ప్రియుడు పలాశ్ ముచ్చల్తో ఏడడుగులు వేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంధాన-ముచ్చల్ జోడీకి గ్రీటింగ్స్ తెలుపుతూ లేఖ రాశారు. వివాహ బంధంలో ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాగా స్మృతి-పలాశ్ ఎంగేజ్మెంట్ ఇప్పటికే పూర్తయింది.
News November 20, 2025
వికారాబాద్లో టెట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి- స్పీకర్

జనవరి 3 నుంచి 31, 2026 వరకు జరిగే తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)-2026 అభ్యర్థుల సౌకర్యార్థం వికారాబాద్ జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రత్యేకంగా లేఖ రాశారు.
News November 20, 2025
ఎగుమతులకు రష్యా చమురు కొనుగోలు చేయం: రిలయన్స్

రష్యా నుంచి కొనుగోలు చేయని చమురును మాత్రమే శుద్ధి చేసి ఎగుమతి చేస్తామని రిలయన్స్ వెల్లడించింది. ఎగుమతులకు ఉపయోగించే చమురు కొనుగోళ్లను నేటి నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి రష్యా నుంచి కొనుగోలు చేయని చమురును మాత్రమే శుద్ధి చేసి ఎగుమతి చేయనున్నట్టు తెలిపింది. అయితే, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని రిలయన్స్ ప్రతినిధి తెలిపారు.


