News September 7, 2024
కుబీర్: వినాయక చవితికి స్పెషల్ ఈ కర్ర గణపతి
వినాయక చవితికి మహారాష్ట్ర ప్రాంతంలోని పాలజ్ కర్ర గణపతికి ఓ ప్రత్యేకత ఉంది. కుబీర్ సమీపంలో ఉంటే ఈ గణపతిని 1948లో ప్రతిష్ఠించారు. 1948లో పాలజ్‌లో అంటువ్యాధులు ప్రబలి 30మందికి పైగా మరణించారు. ఆ సంవత్సరం వచ్చిన వినాయకచవితికి అక్కడి ప్రజలు నిర్మల్‌లో కొయ్య గణపతిని చేయించి వారి గ్రామంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతిసంవత్సరం నిమజ్జనం చేయకుండా గణపతికి పూజలు చేస్తున్నారు.
Similar News
News October 5, 2024
ఆదిలాబాద్: వయోజనులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్
నిరక్షరాస్యులైన వయోజనులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం కార్యక్రమాన్ని రూపొందించిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం సమావేశంలో కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 15 ఏళ్లుపై బడిన నిరక్షరాస్యులను గుర్తించి ఐదు దశల్లో వారికి శిక్షణా నిచ్చి అక్షరాస్యులుగా తీర్చదిద్దాలన్నారు.
News October 4, 2024
నిర్మల్ : నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య శిక్షణను అందించాలి: కలెక్టర్
జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పొందేలా వృత్తి నైపుణ్య శిక్షణలను అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువతకు శిక్షణపై జిల్లాస్థాయి వృత్తి నైపుణ్య సొసైటీ ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించేలా వృత్తి నైపుణ్య శిక్షణలు అందించాలని ఆదేశించారు.
News October 4, 2024
బాసర: ‘సరస్వతి దేవిని దర్శించుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్’
బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యురాలు కుస్రం నీలాదేవి శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.