News December 20, 2024

కుభీర్: అత్యాచారయత్నం కేసులో ఒకరికి జైలు శిక్ష

image

అత్యాచారయత్నం కేసులో ఒకరికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ నిర్మల్ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు సమన్వయ అధికారి ప్రకారం.. కుభీర్ మండలం ఓ గ్రామానికి చెందిన బాలిక 2021 జులై 18న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన నరేశ్ బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక తండ్రి కుభీర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నేరం రుజువు కావడంతో శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

Similar News

News January 25, 2025

నార్నూర్: 7 రోజుల్లో ముగ్గురు మృతి

image

నార్నూర్ మండలంలో గత ఏడు రోజుల్లో ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. మండల కేంద్రానికి చెందిన జాదవ్ విశ్వరక్షక్ ఈ నెల 17న శుక్రవారం ఉట్నూరులో పురుగు మందు తాగి మరణించారు. 23న గురువారం భీంపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ బన్నీ అనే విద్యార్థి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖోఖో పోటీలు ఆడుతూ గుండెపోటుతో మృతిచెందారు. శుక్రవారం మాన్కపూర్ గ్రామానికి చెందిన చంద్రకాంత్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

News January 25, 2025

27 నుంచి ప్రతి మండలంలో ప్రజావాణి: ADB కలెక్టర్

image

ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా ప్రజావాణి కార్యక్రమం ఇక నుంచి ప్రతి రోజూ మండలంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఈ నెల 27 నుంచి కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. రెవెన్యూ, ఉపాధి హామీ, పెన్షన్, రేషన్ కార్డులు, తాగునీరు, విద్యుత్ సమస్యలపై దరఖాస్తులు ఆయా మండలాల్లో కార్యాలయ అర్జీలను సమర్పించాలన్నారు.

News January 24, 2025

రైల్వే జీఎంను కలిసిన ఆదిలాబాద్ ఎంపీ నగేష్

image

సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌ను సికింద్రాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులతో పాటు రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రైళ్ల సంఖ్యను పెంచాలని కోరారు. ఈ విషయాలపై రైల్వే జిఎం సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.