News April 3, 2025

కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య: SI

image

రామభద్రపురం మండలం జన్నివలస గ్రామానికి చెందిన పతివాడ కొత్తయ్య (65) తన కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ ప్రసాద్ వివరాల మేరకు.. కొత్తయ్య కుమారుడు కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News April 11, 2025

పోలీసుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ

image

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ‘పోలీసు వెల్ఫేర్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందిని తన ఛాంబర్‌లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.

News April 11, 2025

విజయనగరం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. విజయనగరం జిల్లాలో ఫస్టియర్ 20,902 మంది, సెకండియర్ 18,384 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 44,531 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 11, 2025

విజయనగరం: రైలులో ప్రయాణిస్తూ.. మహిళ మిస్సింగ్

image

ఈ నెల 4వ తేదీన ట్రైన్ డిబ్రుగఢ్ – వివేక్ ఎక్స్ ప్రెస్ (22503) రైలులో తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తూ ఓ మహిళ మిస్సైంది. పలాస రైల్వే స్టేషన్ సమీపంలోకి ట్రైన్ వచ్చినప్పటికే మహిళ తప్పిపోయిందని పశ్చిమ బెంగాల్ డినజ్పూర్ జిల్లాకు చెందిన ప్రహ్లాద్ దాస్ అనే యువకుడు విజయనగరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!