News April 29, 2024

కుమార్తె సమక్షంలో టీడీపీలో చేరిన తల్లి

image

రాజవొమ్మంగి మండలం గింజర్తి వార్డు మెంబర్ కృష్ణవేణి టీడీపీలో చేరారు. ఆమె వార్డు మెంబర్‌గా గతంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె కుమార్తె శిరీషాదేవి రంపచోడవరం ఉమ్మడి అభ్యర్థిగా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. రాజవొమ్మంగి మండలం వట్టిగడ్డ గ్రామంలో శిరీష తన తల్లికి స్వయంగా టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుమార్తె విజయానికి ప్రచారం చేస్తానని కృష్ణవేణి అన్నారు.

Similar News

News November 12, 2024

తూ.గో: క్యాన్సర్ నివారణపై అవగాహన కార్యక్రమాలు

image

క్యాన్సర్ నివారణ కోసం ప్రజలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ సిబ్బందికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె వైద్యరోగ్య శాఖ ఆధ్వర్యంలో 14 నుంచి ప్రజలందరికీ ఇంటి వద్దనే క్యాన్సర్ పరీక్షలను చేపట్టేందుకు గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎం&హెచ్వో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

News November 11, 2024

తూ.గో: కుక్కల దాడిలో వ్యక్తి మృతి

image

ఉమ్మడి తూ.గో.జిల్లా ఆలమూరు మండలంలో కలవచర్లలో కుక్కల దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగర సూర్యారావు పనిలో భాగంగా బయటికి వెళ్లడంతో కుక్కలు మూకుమ్మడిగా అతనిపై దాడి చేశాయన్నారు. గ్రామస్థులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సూర్యారావు ఆసుపత్రిలో మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు.

News November 11, 2024

తూ.గో: 7 రోజులపాటు ట్రైనీ ఐఏఎస్‌ల పర్యటన

image

ఆల్ ఇండియా సర్వీసెస్‌కు ఎంపికై శిక్షణ పొందుతున్న అధికారులు తమ శిక్షణలో భాగమైన క్షేత్రస్థాయి పర్యటనలను తూర్పుగోదావరి జిల్లాలో 7 రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద శిక్షణకు ఎంపికైన 10 మంది ఐఏఎస్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి క్షేత్రస్థాయి పర్యటనల్లో చేపట్టవలసిన పరిశోధనలపై అవగాహన కల్పించారు