News August 8, 2024

కురబలకోట: కారు ఢీకొని యువకుడి దుర్మరణం

image

కురబలకోట(మం), కంటేవారిపల్లె వద్ద కారు ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడినట్లు ముదివేడు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. తంబళ్లపల్లె మండలం, కోటాలకు చెందిన నాని నాయక్(20), రఘు నాయక్ (21) బైకులో కంటేవారిపల్లెకు వినాయకుని విగ్రహాలు చూడడానికి వచ్చారు. విగ్రహాలు చూసి తిరిగి ఇంటికి వెళ్తుండగా కారుఢీకొని నాని మృతి చెందాడు. రఘునాయక్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 4, 2025

చిత్తూరు జిల్లాలో CIల బదిలీ

image

చిత్తూరు జిల్లాలో ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పలమనేరు అర్బన్ సీఐ కె.మురళీమోహన్‌ను స్పెషల్ బ్రాంచ్ సీఐగా బదిలీ చేశారు. పూతలపట్టు అర్బన్ సీఐ కృష్ణ మోహన్‌ను వీఆర్‌కు పంపారు. చిత్తూరులో వీఆర్‌లో ఉన్న డి.గోపిని పూతలపట్టు అర్బన్ సీఐగా నియమించారు.

News December 4, 2025

రాష్ట్ర స్థాయి విజేతలుగా చిత్తూరు దివ్యాంగ క్రీడాకారులు

image

గుంటూరులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో దివ్యాంగుల (పారా స్పోర్ట్స్)పాఠశాల బ్యాడ్మింటన్ మీట్‌లో రాష్ట్ర స్థాయి క్రీడలను నిర్వహించారు. డిసెంబర్ 1, 2వ తేదీల్లో నిర్వహించిన ఈ క్రీడల్లో చిత్తూరు దివ్యాంగ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర స్థాయి క్రీడాకారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తన ఆఫీసుకు ఆహ్వానించి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు.