News February 2, 2025
కురబలకోట: వృద్ధాప్యంలో ఉన్న తల్లిపై కుమారుడు దాడి

కన్న తల్లిపై కుమారుడు కర్కశంగా వ్యవహరించాడు. తల్లికి వయసు మీద పడిందన్న ఆలోచన కూడా లేకుండా చితకబాదాడు. ఈ ఘటన ఆదివారం కురబలకోట మండలంలో జరిగింది. బాధితురాలి కథనం.. కురుబలకోటకు చెందిన లేట్ రసూల్ సాబ్ భార్య బావాబి (83)కి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నా.. ఒంటరి జీవితం గడుపుతోంది. భర్త నుంచి సంక్రమించిన భూమిలో ఆమెకు తెలియకుండా జొన్నకర్రలు విక్రయించడాన్ని నిలదీయడంతో దాడి చేశాడని వాపోయారు.
Similar News
News November 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 53 సమాధానాలు

1. జ్యోతిర్లింగం మొదలు, తుది తెలుసుకోలేని దేవతలు ‘బ్రహ్మ, విష్ణువు’.
2. తారకాసురుని సంహరించింది ‘కార్తికేయ స్వామి’.
3. దక్ష యజ్ఞాన్ని నాశనం చేసిన శివుడి ఉగ్ర రూపం పేరు ‘వీరభద్ర’.
4. శ్రీకృష్ణుడికి బాణం వేసిన వేటగాడి ‘జరా’.
5. పంచభూత స్థలాల్లో భూమి (పృథ్వీ) లింగం ‘కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం’లో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 1, 2025
ప.గో: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

నల్లజర్ల మండలం దూబచర్ల విద్యా శిక్షణ సంస్థలో 4 సీనియర్ లెక్చరర్స్, 9 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ కమల కుమారి శనివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ప.గో జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు LEAP App లో దరఖాస్తు చేయాలన్నారు. మరిన్ని వివరాలకు www.deoeluru.org వెబ్సైట్ పరిశీలించాలన్నారు. నవంబర్ 3 తో దరఖాస్తు గడువు ముగుస్తుందన్నారు.
News November 1, 2025
కొత్తగూడెం: ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం తనిఖీ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ పరిశీలనలో భాగంగా సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి రానివ్వకూడదని అధికారులకు సూచించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు.


