News February 26, 2025
కురవి జాతర ఏర్పాట్లపై సమీక్ష

ఎస్పీ రామ్‌నాథ్ ఆదేశాలతో కురవి జాతర ఏర్పాట్లపై తొర్రూరు డీఎస్పీ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి, ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ ఇతర అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై తొర్రూరు డీఎస్పీ పలు సూచనలు చేశారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 20, 2025
వనపర్తి: జిరాక్స్, మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ల బంద్‌కు కలెక్టర్ ఆదేశాలు

రేపటి నుంచి 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని జిరాక్స్, మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాలు మూసి వేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు మూసి ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను ఎవరైనా ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
News March 20, 2025
పామాయిల్ సాగుతో లాభాలు: వనపర్తి కలెక్టర్

పామాయిల్ సాగు చేస్తే ఎంతో లాభదాయకంగా ఉంటుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. రైతులకు అవగాహన కల్పించి పామాయిల్ సాగుకు ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. పంట సాగు 4 సంవత్సరాల వరకు రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, పంటను కంపెనీ వారే కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. 4 సంవత్సరాలు చూసుకుంటే 35 సంవత్సరాల పాటు లాభాలను ఆర్జించవచ్చని తెలిపారు.
News March 20, 2025
వనపర్తి: ఈ యాప్ డౌన్లోడ్ చేశారంటే మీ అకౌంట్ ఖాళీ: పోలీసులు

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామ వాట్సాప్ గ్రూపులో పీఎం కిసాన్ నిధి యోజన అనే APK డాక్యుమెంట్ వాట్సాప్ గ్రూప్‌లో రావడంతో కొందరు యువకులు డాక్యుమెంట్ డౌన్లోడ్ చేయగా వారి ఫోన్ హ్యాకింగ్ గురై వాట్సాప్ గ్రూపులన్నింటికీ APK ఫార్వర్డ్ అవుతుంది. కావున పీఎం కిసాన్ యోజన్ అంటూ మెసేజ్ వస్తే దాన్ని ఓపెన్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.