News February 20, 2025
కురవి వీరభద్రస్వామి వారిని దర్శించుకున్న గోపిచంద్

మహబూబాబాద్ జిల్లాలోని కురవి శ్రీ వీరభద్రస్వామి వారిని సినీ హీరో గోపిచంద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోపిచంద్ మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం గొప్ప అనుభవమని, కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కార్యనిర్వాహణాధికారి సత్యనారాయణ, ధర్మకర్త చిన్నం గణేశ్ అందజేశారు.
Similar News
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.
News November 26, 2025
ఏలూరు: రాజ్యాంగ పీఠికపై ప్రమాణం

ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు రాజ్యాంగ పీఠికను అనుసరిస్తామని ప్రమాణం చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీదేవి మాట్లాడుతూ.. జాతీయ న్యాయదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటామన్నారు. భారత రాజ్యాంగంపై యువతకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
News November 26, 2025
గద్వాల: జీపీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: ఈసీ

గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిజర్వేషన్లు, విడతల వివరాలు, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ వివరాలను టీఈ-పోల్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం నోడల్ ఆఫీసర్ను నియమించి, గ్రీవెన్స్ ప్లాట్ఫామ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.


