News September 28, 2024

కురసాల, పినిపే, భరత్‌కు YCP కీలక బాధ్యతలు

image

వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు ఉమ్మడి తూ.గో.జిల్లాలో వివిధ హోదాల్లో పార్టీ నాయకులను నియమిస్తూ పార్టీ తాడేపల్లి కేంద్ర కార్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు, కోనసీమ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్‌ను నియమించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని భరత్ రామ్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News December 1, 2025

తూ.గో: చేతబడి చేశారన్న అనుమానంతో దారుణ హత్య

image

కోరుకొండ (M) దోసకాయలపల్లిలో ఆనంద్ కుమార్ (30) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. ఆనంద్ తనకు చేతబడి చేశాడని రాజ్‌కుమార్ అనుమానంతో కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఆనంద్ భార్య త్రివేణికి రాజ్ కుమార్ సమీపబంధువు. అతను కొన్నాళ్లు ఆనంద్ ఇంట్లో ఉండేవాడు. ఆ సమయంలో భార్య పట్ల రాజ్‌కుమార్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అతన్ని బయటికి పంపించారు. కక్ష పెట్టుకున్న రాజ్‌కుమార్ హత్య చేశాడని CI సత్య కిషోర్ వివరించారు.

News December 1, 2025

పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

డిసెంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన పెన్షన్ రేట్ల ప్రకారం డిసెంబరు నెలలో మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.1027.04 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వివరించారు.