News April 10, 2024
కురిచేడు: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

కురిచేడు మండలంలోని పడమర నాయుడుపాలెంలో విద్యుత్‌షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పల్లె పాపయ్య(49) ఇంట్లో ఫ్యాన్ తిరగకపోవడంతో మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News March 6, 2026
కొత్తపట్నంలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

కొత్తపట్నం మండలం కే పల్లిపాలెం తుఫాన్ బిల్డింగ్ వద్ద శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు పెదగంజం గ్రామానికి చెందిన పాలేటి గోపి (29)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానిక SI వేముల సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని SI తెలిపారు.
News March 6, 2026
మార్కాపురం జిల్లా వైద్యశాలలో వేధిస్తున్న డాక్టర్ల కొరత

మార్కాపురం జిల్లా వైద్యశాలలో డాక్టర్లు, వైద్య పరికరాలు, సరైన యంత్రాలు లేక పేషెంట్లకు వైద్యం అందడం లేదు. ఎర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాలలో పేషెంట్లను ఎమర్జెన్సీ వైద్య సదుపాయం కోసం జిల్లా వైద్యశాలకు డాక్టర్లు రిఫర్ చేస్తారు. ఇక్కడ సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో ఒంగోలు రిమ్స్‌కు రిఫర్ చేయడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా జిల్లా వైద్యశాలలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించాలని పేషెంట్లు కోరుతున్నారు.
News March 6, 2026
మాచవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

కనిగిరి మున్సిపల్ పరిధిలోని మాచవరం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పిడుగురాళ్లకు చెందిన సాతులూరి రాంబాబు (45) గా స్థానికులు గుర్తించారు. ఈయన కొంతకాలంగా పచ్చాకు కూలీగా పనిచేస్తున్నాడు. స్థానికులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


