News March 31, 2025
కురుపాంలో ఏనుగుల గుంపు సంచారం

పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఏనుగుల గుంపు నుంచి తిప్పలు తప్పడం లేదు. పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో సంచరిస్తూ రైతులను, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం ఉదయం కూడా కురుపాం మండలం సీతంపేట, పూతిక వలస ప్రాంతాల్లోని చెరుకు, అరటి, పామాయిల్ తోటల్లో తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు, అటుగా ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Similar News
News October 22, 2025
పాలమూరు: మద్యం షాపు దరఖాస్తుల గడువు రేపటితో ముగింపు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ఈనెల 23తో ముగియనుంది. ఈసారి 10 వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేయగా, గడువు పొడిగించినా ఇప్పటివరకు కేవలం 5,188 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మరో రెండు రోజులు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
News October 22, 2025
ADB: పత్తి రైతులకు శుభవార్త

పత్తి రైతులకు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ శుభవార్త చెప్పింది. ఈనెల 27 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. పంట విక్రయించే రైతులు కచ్చితంగా కిసాన్ కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. స్లాట్ బుకింగ్ ఈనెల 24 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన 8 శాతంలోపు తేమతో కూడిన పత్తి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర 8110 పొందాలని పేర్కొన్నారు.
News October 22, 2025
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

TG: రాష్ట్రంలో ఈ నెల 26 వరకు వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.