News April 24, 2024

కురుపాం: స్వతంత్ర అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ నామినేషన్

image

కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి ట్రాన్స్ జెండర్ అడ్డాకుల గీతా రాణి సమర్పించారు. సోమవారం కురుపాం తాహశీల్దార్ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్ గీతా రాణి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న తాము ఎన్నికలలో పోటీ చేసి తమ బలాన్ని నిరూపించుకోవాలన్నదే లక్ష్యం అన్నారు.

Similar News

News January 23, 2026

VZM: ఐటీఐ & డిప్లొమా యువతకు రష్యాలో ఉద్యోగాలు

image

ఐటీఐ & డిప్లొమా అర్హత కలిగిన యువతకు రష్యాలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఎంపికైన వారికి నెలకు 60,000 రూబిల్స్ జీతం, 10,000 భత్యం, ఉచిత వసతి, టికెట్లు, బీమా సదుపాయాలు కల్పిస్తారన్నారు. 20 ఏళ్లు పైబడిన వారు naipunyam.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News January 23, 2026

VZM: 27న జాబ్ మేళా.. నెలకు రూ.30,000 వరకు జీతం

image

విజయనగరంలోని మహారాజా కళాశాల ఆవరణలో ఈనెల 27న ఉదయం 10 గంటల నుంచి భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. నాలుగు సంస్థల ద్వారా 595 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత ఉన్న యువతీ, యువకులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.14,765 నుంచి రూ.30,000 వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు employment.ap.gov.in, ncs.gov.inలో నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు.

News January 23, 2026

ఉపాధి హామీ కింద 100 రోజుల పని తప్పనిసరి: VZM కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం కింద ప్రతి వేతనదారునికి 100 రోజుల పని తప్పనిసరిగా కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి పనులు, కుటుంబ సర్వే, అక్షరాంధ్ర కార్యక్రమాలపై మండల వారీగా సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గృహ సర్వే ఫిబ్రవరి 10లోపు శతశాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు.